అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 174 మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యసాహసాలను దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. ఆయన చూపిన సాహసం దేశం తల ఎత్తుకునేలా చేసిందని ప్రశంసించారు. ఆపత్కాలంలో కెప్టెన్ స్మిత్ చూపిన తక్షణ స్పందన మరియు శౌర్యం వల్లే భారీ ప్రాణనష్టం తప్పిందని, గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తన విధుల్లోకి రావాలని ఆమె ఆకాంక్షించారు.