స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు నెం.105, 1065లను న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటకూడదన్న నిబంధనను ఈ వ్యవహారంలో పరిగణనలోకి తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో జీవోలు జారీ చేసింది.