ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు.<span;>మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయో వృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. సీనియర్ సిటిజన్ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటిసారిగా వాడడం జరిగింది.