మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో ఒక చిన్న ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం, షూటింగ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఉండగా రామ్ చరణ్ కంటి సమీపంలో చిన్నపాటి గాయమైంది. అయితే, దీనిపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం స్వల్ప గాయం మాత్రమేనని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

