మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితా నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రులు నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి.ఓటరుగా నమోదు కావాలంటే 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ లేదా సమానమైన డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఆ తేదీలోపు విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ జారీ చేసిన డిగ్రీ ధ్రువపత్రం, మార్కుల మెమో లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే సంబంధిత నియోజకవర్గం పరిధిలోనే నివసిస్తూ ఉండాలి.ఫారం-18తో నమోదు చేసుకోవచ్చు.