క్రికెట్ ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. అభిమానుల్లో అప్పుడే వరల్డ్‌కప్ ఫీవర్ పీక్స్‌కు చేరింది.. వచ్చే ఏడాది జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ టికెట్ బ్యాలెట్ ఓపెన్ చేసిన కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 1.5 కోట్లకు పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో జరిగే టీమిండియా తొలి మ్యాచ్‌తో పాటు భారత్-పాక్ సమరానికి టికెట్ల కోసం ఫ్యాన్స్ఎగబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 142 దేశాల నుంచి దాదాపు 44.23 లక్షల మంది అభిమానులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, మొత్తం 1,50,83,752 టికెట్ అప్లికేషన్లు దాఖలైనట్లు ఐసీసీ వెల్లడించింది.