ఇన్స్టాగ్రామ్లో నాగార్జునతో కలిసి దిగిన స్పెషల్ ఫొటోను షేర్ చేసిన అఖిల్.. “హ్యాపీ బర్త్డే మై ముఫాసా. మా కోసం మీరు చేసే ప్రతిదానికీ, మాపై చూపించే ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీరు లేకుండా మాకు ఏదీ సాధ్యం కాదు. అన్నింటికంటే ముఖ్యంగా నాకు మంచి తండ్రిగా నిలిచినందుకు థ్యాంక్యూ. లవ్ యూ నాన్న.. ఎప్పుడూ సంతోషంగా ఉండండి” అంటూ రాసుకొచ్చారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ అఖిల్ పెట్టిన భావోద్వేగ పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది.