గత ప్రభుత్వ హయాంలో మతమార్పిడులను ప్రోత్సహించారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై YCP తీవ్రంగా మండిపడింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి, ప్రజల్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు తెరలేపుతోందని పార్టీ నేతలు విమర్శించారు. ప్రభుత్వం సాధించిన విఫలాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడానికే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.భార్యాభర్తల వ్యక్తిగత, అంతర్గత వివాదాలను తీసి రాజకీయ పార్టీకి, మతానికి ముడిపెట్టి స్వార్థ ప్రయోజనాలు పొందాలని చూడటం అత్యంత దిగజారుడు రాజకీయామంటూ ఆక్షేపించారు.