తెలంగాణలోని Bi.P.C స్ట్రీమ్ విద్యార్థులకు బి.ఫార్మసీ, ఫార్మ్-డి (Pharm-D), బయో-టెక్నాలజీ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమై 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ వ్యవధిలో తమ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు నిర్ణీత కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.