దామచర్ల ఆరోపణలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను చేసిన ఆరోపణలపై దామచర్ల జనార్ధనరావు నుంచి సమాధానం లేదని, తనను లోపేలేస్తానంటున్నావని, దమ్ముంటే తనపై విచారణ చేపట్టాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడును అడుగు అని సలహా ఇచ్చారు. అర్థరాత్రి వరకు మందుతాగుతూ సెటిల్మెంట్లు చేస్తున్నావని, తమకు ఇసుక, మద్యం, రేషన్ డీలర్ల నుంచి నెల నెలా మామూళ్లు రావడం లేదా? అని ప్రశ్నించారు. కాణిపాకం వెళ్దామన్నావు, తాను రెడీ, ఎప్పుడు వెళ్దామో చెప్పు అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.