మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండలం గుండంపెల్లి గ్రామ రైతులు నిర్మల్- బైంసా జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కొనుగోలు కేంద్రాలు లేక పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జాంమ్ ఏర్పడింది.