తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలోని పారిశ్రామిక వాడలో దిగ్గజ సంస్థ కారియర్ ఏసీల తయారీ పరిశ్రమకు క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ ఛైర్మన్, సీఈవో డేవిడ్ ఎల్ గిట్లిన్ తో కలిసి మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. తమ లక్ష్యం ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే కాదని 20 లక్షల ఉద్యోగాలుకల్పించడమే తమ లక్ష్యం అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. గ్లోబల్ దిగ్గజం ఏపీకి రావడం ఎంతో ఆనందదాయకమని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.