పశ్చిమబెంగాల్ SIRలో భాగంగా మొతాబ్ షేక్ అనే వ్యక్తి పేరును తొలగించారు. తన పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ మొతాబ్ షేక్ సుప్రీంకోర్టు నియమించిన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఎమ్మెల్యే నామినేషన్ల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు మొతాబ్ ఓటు హక్కును పునరుద్ధరిస్తూ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. దాంతో ఆయన ఫరక్కా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఆయన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సునీల్ చౌధరిపై ఆయన 8 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలిచారు.