దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల ఆందోళనలను ఒకే వేదికపై నమోదు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. సత్యాగ్రహ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. భూమి కోసం, మహిళా హక్కుల కోసం, దళిత, ఓబీసీ హక్కులు, విద్య ఆందోళన చేపట్టేవారు ఇక నుంచి తమ ప్రొటెస్ట్‌ను సత్యాగ్రహ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలని రాహుల్ కోరారు. దీని వల్ల ఓ విపక్ష నేతగా తనకు తోచిన రీతిలో ఆ నిరసనలను ప్రభుత్వానికి చేరేలా చేయనున్నట్లు చెప్పారు.