ముంబయిలోని శివాజీ పార్కులో వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరో కీలక ప్రకటన చేసింది. CEC జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయకపోతే అక్టోబర్ 10న దిల్లీలోని జంతర్మంతర్ వద్ద మరోసారి పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని హెచ్చరించింది. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి నిరసనకారులు దిల్లీకి తరలివస్తారని తెలిపింది. ఈ శాంతియుత ఆందోళనలో ప్రజలు, పౌరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎక్స్ పోస్టులో వెల్లడించారు.