పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సమగ్ర చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పిల్లలపై పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు.. బాధిత పిల్లలకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాసం అందేలా అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ హైకోర్టు, టీజీఎస్-ఎల్‌ఎస్‌ఏతో సమన్వయం చేసుకుని పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.