సామాజిక మాధ్యమాల్లో AI సాంకేతికతను ఉపయోగించి అసభ్యకర రీతిలో వీడియోలను క్రియేట్ చేయడం పై అగ్రకథానాయకుడు Jr ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ పాట వీడియోను ఏఐతో మార్ఫింగ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. మహిళలను పూజించే దేశంలో వారి గౌరవాన్ని దిగజార్చారంటూ ఎక్స్ పోస్ట్ చేశారు. వారిని వదిలిపెట్టబోనని, బాధ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, ఇలాంటి నీచమైన కంటెంట్ను సృష్టించడం సిగ్గుచేటు. ‘చుట్టమల్లే’ పాట మార్ఫింగ్ వీడియో వెనుక ఉన్న నీచులు ఎవరినీ వదిలిపెట్టను” అని ఎన్టీఆర్ హెచ్చరించారు.