దేశవ్యాప్తంగా రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) వేడుకలు ఘనంగా జరుగుతున్న తరుణంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం మరియు విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. “అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందం, సమృద్ధి, విజయాలను తీసుకురావాలి” అని ప్రధాని మోదీ హిందీలో పోస్ట్ చేశారు.