బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించడం బీజేపీకి అలవాటుగా మారింది. గతంలో ప్రధాని మోదీ పార్లమెంటులో తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే, ఇప్పుడు ఈ ఎంపీ అంతకంటే ఘోరంగా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఏర్పాటు జరిగింది. దీనిని అశాస్త్రీయం అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తేజస్వీ సూర్యపై నిప్పులు చెరిగారు.

