మహిళా బిల్లు విషయంలో ప్రధాని మోదీ సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని.. కానీ డీలిమిటేషన్ బిల్లును మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దేశంలో కులగణన ఎందుకు నిర్వహించడం లేదని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. అట్టడుగు వర్గాలకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ఓబీసీలకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉందని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

