దేశ పార్లమెంటరీ చరిత్రలో ఈరోజును మరిచిపోలేమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ చారిత్రక సమయంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకమని, వారిని కలుపుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. మహిళలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని కొనియాడారు. మహిళా బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరు. బిల్లును వ్యతిరేకించే పార్టీలకు, నేతలకు మహిళలు బుద్ధి చెబుతారు.
అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

