తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన టైం వచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. చొరబాటుదారుల్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి ఢిల్లీ వేదికగా ర్యాలీ చేశారంటూ ఎద్దేవా చేశారు. విదేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులకు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మద్దతివ్వడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంలపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదంట. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది. రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యారు.

