మోత్కూరు మండలం అనాజీపురం దగ్గర తీన్మార్ మల్లన్న కాన్వాయ్ లోని ఒక కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మల్లన్న అనుచరులకు గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో ఉన్న మల్లన్న లారీ అదుపుతప్పి కాన్వాయ్ లోని ఒక కారును ఢీకొట్టడంతో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.