గోవధ నిషేధం ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే సాధించింది తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఆవులను, దూడలను బక్రీద్ సందర్భంగా వధించకుండా చూడాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. వాటిని సవరించాలని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. నిర్దిష్ట ప్రాంతాల్లో ఆవుల వధకు చట్టం అనుమతించినప్పుడు, దానికి విరుద్ధంగా ఇచ్చిన ఈ ఆదేశాలు చెల్లవని పేర్కొంది.