తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ప్రముఖ సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపై బేగంబజార్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. లైవ్ డిబేట్ కార్యక్రమం జరుగుతుండగా YCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను యాంకర్ గా ఉన్న కొమ్మినేని అడ్డుకోలేదని, ఆ వ్యాఖ్యలను ప్రోత్సహించేలా వ్యవహరించారంటూ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కైలాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు యాంకర్ పై చర్యలకు దిగారు.