ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘పవన్ తన జీవితంలో శారీరక నొప్పి కంటే తీవ్రమైన ఎన్నో భారాలను, కష్టాలను మోశారు. ఎంతటి బాధ ఉన్నా ఎప్పుడూ ఫిర్యాదు చేయని ఆయన, ఆ నొప్పి భరించలేని స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే తన బాధను బయటపెడతారు’’ అని అన్నా కొణిదెల భావోద్వేగంగా పేర్కొన్నారు ప్రస్తుతం తన దృష్టంతా పవన్ ఆరోగ్యంపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు.