పీజీ భవనం కూలిన ఘటనపై ప్రముఖ నటుడు సోనూసూద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు దేశ రాజధానిలో విద్యార్థుల సంఖ్యకు, అందుబాటులో ఉన్న హాస్టల్ సౌకర్యాలకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీల్లో సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, కేవలం 30 వేల మందికి మాత్రమే హాస్టల్ వసతి లభిస్తోందని, ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి సురక్షితమైన హాస్టళ్లను నిర్మించాలని, అలాగే క్యాంపస్‌లలో వసతిని పెంచుకోవడానికి వర్సిటీలకు అదనపు అనుమతులు ఇవ్వాలని ఆయన సూచించారు.