ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా మరోసారి కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు దిగింది. నీట్ అవకతవకలు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నిరసన కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, ప్రజలు, యువత హాజరయ్యారు. జాతీయ జెండాలు, అంబేడ్కర్ చిత్రపటాలతో నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.