డీజే (DJ) డ్రమ్స్ ఇచ్చే రాక్షస శబ్దాల తీవ్రతకు ఒక నిరుపేద కూలీ కొడుకు మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి, మృత్యువుతో పోరాడుతున్న ఘోర ఉదంతం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. డీజే పాటల హోరుకు పార్థు నృత్యం చేస్తుండగా డీజే స్పీకర్ల నుండి వచ్చిన విపరీతమైన శబ్ద తరంగాల తీవ్రత గుండె నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళం తీవ్రంగా దెబ్బతిని,లోపల బ్లీడింగ్ అవుతున్నట్లు, రక్తం గడ్డకట్టిందని నిర్ధారించారు తండ్రి తన కొడుకును బతికించుకోవడానికి దాతల కోసం కన్నీరుమున్నీరుగా ఎదురుచూస్తున్నాడు.