కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. ‘జన నాయగన్’ వాయిదా పడటంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి ‘బుక్‌మైషో’ రీఫండ్ చేస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద రీఫండ్ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సుమారు 5 లక్షలకు పైగా టిక్కెట్లను రీఫండ్ బుక్ మై షో చేస్తోంది. సుమారు రూ. 20 కోట్ల మేరకు ఆ సంస్ధ తిరిగి తన యూజర్స్‌కు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

