తమిళనాడులో సీఎం విజయ్ గెలుపు వెనుక కీలకంగా పని చేసిన కపిల్ సాహు ఏపీలో జగన్ పార్టీ కోసం సర్వే చేయించారు. రాయలసీమ లోని రెండు, ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాలకు సంబంధించి ఈ నివేదిక ఇచ్చారని చెబుతున్నారు. అందులో 2029 ఎన్నికల్లో ముఖ్య నేతల వారుసులకు ఛాన్స్ ఇచ్చే విషయంలో ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్లనే బరిలోకి దింపాలని.. గతంలో అభ్యర్ధులను నియోజకవర్గాలకు చేసిన మార్పులను రద్దు చేసి సొంత నియోజకవర్గాలకు పంపాలని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.