చెన్నై సూపర్ కింగ్స్ కు సుదీర్ఘంగా సేవలు అందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో టీమ్ ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు. కొత్త ప్రధాన కోచ్ కోసం CSK అన్వేషిస్తున్నప్పుడు.. ధోని కొన్ని షరతులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి భారత్ నుంచే కోచింగ్ బృందం ఉండాలని చెప్పాడట. దీంతో చాలా మంది హేమంగ్ బదానీని సూచించారు. కానీ, అనూహ్యంగా జహీర్ ఖాన్ ను CSK ప్రకటించింది.