19080-90లో రాధతో పాటు ఆమె సోదరి అంబిక తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ నటీమణులుగా వెలుగొందారు. నటి రాధ తన సోదరి అంబికపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంచలనాత్మక ఫిర్యాదు చేశారు. తాను సంతకం చేసిన పాత చెక్కులను ఉపయోగించి రూ.46 కోట్లను మోసపూరితంగా నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నం జరిగిందని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ చెక్కు మోసంలో తన సోదరుడు మల్లికార్జున్ కూడా ప్రమేయం కలిగి ఉన్నారని నటి రాధ తనిచ్చిన పోలీస్ కంప్లైంట్లో పేర్కొన్నారు.