ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఒక ఉపాధ్యాయురాలిని తుపాకీతో కాల్పులు జరిపి ఆమెను హత్య చేశాడు. తర్వాత గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 26 ఏళ్ల నిషాత్ ఫాతిమా చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నది. మహమ్మద్ సౌద్ కారిడార్‌లో ఫాతిమాను కలుసుకుని మాట్లాడుతూ ఉన్నట్టుండి బ్యాగ్ నుంచి తుపాకీ తీసి కాల్పులు జరిపి హత్య చేశాడు. ఫాతిమా, సౌద్ చాలా కాలంగా ఒకరికొకరు తెలుసని, నిత్యం మాట్లాడుకునేవారని పోలీస్ అధికారిణి ఖ్యాతి గార్గ్ తెలిపారు