సైనిక ఘర్షణలతో యుద్ధాలకు పరిష్కారం లభించదని, శాంతి ఏర్పడబోదని ప్రధాని మోదీ అన్నారు. చర్చల ద్వారానే శాంతిస్థాపన సాధ్యమవుతుందని సూచించారు. రష్యా–ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాల్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ఆపాలని ప్రధాని సూచించారు. నార్వే పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని జోనాస్ గర్ స్టోర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని అంతం చేయాలని సూచించారు. ‘‘ప్రస్తుతం ప్రపంచం అస్థిరత, అనిశ్చితిలో ఉంది. తీవ్రవాదంపై పోరులో ఇండియాకు మద్దతుగా నిలిచినందుకు నార్వేకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.