ముంబయి-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర పరిధిలోని ధనివరిలో పశువుల్ని తరలిస్తున్న కంటైనర్ ను ఓ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో దాదాపు 100మంది ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వారంతా వివాహ వేడుకలో పాల్గొనేందుకు బాపుగావ్ ప్రాంతం నుంచి ధనివరికి వెళ్తున్నట్లు సమాచారం.