ప్రధాని నరేంద్ర మోదీకి నార్వే అత్యున్నత పురస్కారం లభించింది. నార్వే పర్యటనలో ఉన్న ఆయనకు ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వీజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును అందజేశారు. నార్వే ప్రయోజనాలు, అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడంలో చేసిన విశేష సేవలకు గాను దీనిని ప్రదానం చేస్తారు. ఈ అవార్డును భారత ప్రజలకు, భారత్-నార్వే స్నేహబంధానికి అంకితం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. ఇది ఆయన అందుకున్న 32వ గ్లోబల్ అవార్డు కావడం విశేషం.