మహారాష్ట్రలో సభ్యసమాజం తలదించుకునేలా ఓ అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌లోని విఠల్‌వాడీ ప్రాంతంలో ఓ మహిళపై సామూహికంగా అమానుషానికి ఒడిగట్టారు. బాధితురాలి బట్టలు ఊడదీసి, అర్థనగ్నంగా మార్చి, జుట్టు కత్తిరించి, చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించిన దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. తమ కులదైవాలను, దేవతలను బాధితురాలు అవమానించిందని.. అందుకే ఆమెను గుడిలోకి రానివ్వకుండా అడ్డుకున్నామని, ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వివాదం ముదిరి ఈ దారుణానికి దారితీసిందని నిందితులు వాదిస్తున్నారు.