నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా హేగ్ నగరంలో జరిగిన ప్రవాస భారతీయుల ఘన సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అక్కడ ఉన్న భారతీయుల ప్రేమాభిమానాలు, ఉత్సాహాన్ని చూసి తాను నెదర్లాండ్స్ లో ఉన్నాననే విషయమే మర్చిపోయానని, భారతదేశంలోనే ఏదో పండుగ వేడుకల్లో పాల్గొంటున్నట్లు అనిపించిందని ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. హేగ్ నగరం భారత్-నెదర్లాండ్స్ స్నేహ బంధానికి ఒక సజీవ చిహ్నంగా మారిందని మోదీ కొనియాడారు.