మల్లికార్జున్ ఖర్గే సభ ముగిసిన తర్వాత ఆ ప్రాంగణంలో ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించడంపై విలేకరుల సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం రెండు భావజాలాల నడుమ పోరాటం సాగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకవైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి మహానీయులు అందించిన రాజ్యాంగ భావజాలం ఉంటే, మరొకవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయాలు ఈ రెండింటి మధ్యే నడుస్తున్నాయని స్పష్టం చేశారు.