పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఆయనకు ఒకప్పుడు సహచరుడైన జావెద్ మియాందాద్ పాక్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశాడు. “ఇమ్రాన్ ఖాన్ నిజాయతీపరుడే. అవినీతి పనులు చేసే వ్యక్తి కాదు. అలాంటివాడే అయితే ఇంకా ఎన్నో చేసేవాడు కదా. ఒకవేళ ఇప్పుడు ఇమ్రాన్‌ను వదిలేస్తే ఏం జరుగుతుంది? అతడు ఎవరికైనా హాని చేస్తాడా? అతడు కూడా ఒకరికి కుమారుడే. అతడు ఏం చేస్తుంటాడా? అని నేనెప్పుడూ ఆలోచిస్తూనే ఉంటా” అని జావెద్ మియాందాద్ వెల్లడించారు.