నేపాల్‌ను వరద ముప్పు మరోసారి భయపెడుతోంది లెండే ఖోలా నదీ వ్యవస్థ ఎగువ ప్రాంతంలో హిమనీనదం కూలిపోవడంతో కొండచరియలు, శిథిలాలు అడ్డుకట్టగా తాత్కాలిక సరస్సు ఏర్పడిందని చోచెన్ నది, పురేపు నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన ఈ సరస్సులో 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరినట్లు చైనా జలవనరుల శాఖ తెలిపింది. తాత్కాలిక అడ్డుకట్టలో కొంత భాగం తెగిపోతే గరిష్ఠంగా సెకనుకు 500 క్యూబిక్ మీటర్ల నీరు దిగువకు ప్రవహించే అవకాశం ఉందని చైనా వరద నమూనా అధ్యయనాలు సూచిస్తున్నాయి.