ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల సందర్భంగా తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది ఇరాన్ పౌరులు జాతీయ జెండాలతో పాటు, ప్రతీకారానికి చిహ్నంగా భావించే ఎరుపు రంగు జెండాలను చేతబూని మొసల్లాకు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహులను లక్ష్యంగా చేసుకుని రాసిన హెచ్చరిక పోస్టర్లు, గ్రాఫిటీలు అక్కడ పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. ఇరాన్ కవి మహ్మద్ రసూలీ మాట్లాడుతూ.. ట్రంప్‌ను హతమార్చడమే తమ తదుపరి బాధ్యత అని బహిరంగంగా పిలుపునిచ్చారు.