నారాయణపేట జిల్లా బైరంపల్లి గ్రామంలో విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నా వారికి బోధించాల్సిన ఉపాధ్యాయుడు మాత్రం క్యాజువల్ లీవ్‌లో ఉండటంతో పాఠశాల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏకోపాధ్యాయుడిగా పనిచేస్తున్న టీచర్ సెలవులో ఉంటే ప్రత్యామ్నాయ బోధనా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, విద్యార్థుల చదువులపై కనీస పర్యవేక్షణ కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయుడు సెలవులో ఉంటే ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయడం ఎవరి బాధ్యత..? విద్యార్థుల విలువైన విద్యా సమయం వృథా అయితే బాధ్యత ఎవరిది.. ? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

