టోల్ గేట్ల సమీపంలో నివసించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. ఇకపై ప్రతీసారి మీరు టోల్ చెల్లించనక్కర్లేదు. ఒక్కసారి పాస్ తీసుకుంటే నెల రోజుల పాటు ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవచ్చు. టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు లోకల్ పాస్ పొందవచ్చు. ఈ పాస్ ధర రూ.350 నుంచి ప్రారంభమవుతుంది. వాహనం కేటగిరీని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. తాజాగా దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాలకు దీనిని వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది.

