నగరంలో రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటైన కాసు బ్రహ్మానందరెడ్డి (KBR) పార్కు చుట్టూ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన నిర్మాణ పనులు రద్దయ్యాయి. కేబీఆర్ పార్కు చుట్టూ 7 జంక్షన్లలో రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా చేపట్టిన స్టీలు బ్రిడ్జీలు, అండర్పాస్ల నిర్మాణ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వన్ వే విధానం ద్వారా వాహనదారులకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడంతో ప్రభుత్వం దీనిపై పునరాలోచించింది. ఈ క్రమంలో వందల కోట్లు ఖర్చు చేసి ఆ నిర్మాణాలు చేపట్టడం వృథా అని ప్రభుత్వం భావించింది.