తెలంగాణ వ్యాప్తంగా బార్అండ్ రెస్టారెంట్లను సోమవారం మూసివేయనున్నట్టు రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తమపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా సోమవారం బార్ల బంద్ కు పిలుపునిస్తున్నామని తెలిపింది. అవసరమైతే నిరవధిక బంద్ కు కూడా వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.4 లక్షల మేరకు లైసెన్సు
ఫీజు పెంచిన ప్రభుత్వం మళ్లీ ప్రివిలేజ్ ఫీజు పేరుతో 10 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించిందని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్ బంద్ నిర్వహిస్తున్నామని వెల్లడించింది.

