ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడం వల్లే తన విషయంలో తీవ్ర వివక్ష కొనసాగుతోందని స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు. ‘నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాల గురించి తనకు సమాచారం ఇవ్వడం లేదని, ఇదే ఇతర సామాజికవర్గాల ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల ఇలా చేయగలరా? ఎస్సీ, ఎస్టీ, బీసీ శాసనసభ్యులు మీ దృష్టిలో ఏంటి?’ అంటూ కొలికపూడి ఆదివారం పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. నియోజకవర్గంలో అలజడి సృష్టించే కుట్రలు జరుగుతున్నాయంటూ.. మరో పోస్టు పెట్టారు.