అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డకు సెన్సార్ బోర్డులో చోటుదక్కింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన నూతన బోర్డును కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇందులో టాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త సుప్రియ యార్లగడ్డకు స్థానం దక్కింది.