తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయం తర్వాత జరిగిన ఈ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలైన వృద్ధాప్య పింఛన్ రూ. 4000కు పెంపు, మరియు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఆర్థిక సాయం అమలుపై అధిష్టానం ఆరా తీసింది.

